భౌతికంగా చూస్తే గాఢనిద్రలో శాంతి లభిస్తుంది. సంకల్ప రాహిత్యమైనప్పుడు శాంతి కలుగుతుంది. కాని సంకల్పాన్ని అరికట్టడానికి వీలుకాదు. కనుక సాధ్యమైనంతవరకు దినంలో ఒక గంట మౌనం పాటించాలి.
అతిగా మాట్లాడితే తలలో నరాలన్నీ బలహీనమైపోతాయి. పవిత్రమైన మాటలు మాట్లాడితే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అపవిత్రమైన మాటలు మాట్లాడితే మీ జీవితం అథోగతి పాలవుతుంది.
మితంగా మాట్లాడే వాడు. సమాజంలో సత్కీర్తి పొందుతాడు. ఊరికే వాగుడు వాగకండి. అతిభాష మతి హాని. మిత భాష అతి హాయి.
మీరు శ్రీమంతులే కావచ్చు. లక్షాధికారులే కావచ్చు Simple Living, High Thinking అలవర్చుకోవాలి. ఆడంబరానికి పోకూడదు. ఆడంబరానికి వెళ్తే అహంకారం బయలుదేరుతుంది.
(దే.యు. పు. 14)
(చూ|| నగర సంకీర్తను)