కృతయుగంలో - ధ్యానము
త్రేతాయుగంలో - యజ్ఞం
ద్వాపరయుగంలో - అర్చనము
కలియుగంలో - నామస్మరణ
ఇవే మానవునకు ముఖ్యమార్గాలు.
(భ.స.మ. పు. 224)
మానవులు సంచరించు మార్గములు రెండు. అవి ధర్మమార్గము. బ్రహ్మమార్గము. ధర్మమార్గమనగా ఇహలోకమునకు సంబంధించిన ధర్మములను సంఘమునకు సంబంధించిన ధర్మములను చక్కగా నాచరించుట. బ్రహ్మమార్గమనగా ఆత్మధర్మములను తెలిసికొని, తత్సంబంధ సాధనలను చక్కగా జేయుట. మానవుడు కుడిచేతితో భగవంతుని పట్టుకొనియెడమచేతితో లోకమును పట్టుకొనవలెను. క్రమముగా ఎడమచేయి పట్టు వీడును; ఎడమగును. అనగా దూరమగును లేదా విడిచిపోవును. ఇందును గూర్చి చింతింప పనిలేదు. అది సహజమే. అందు వలననే ఆ చేతికి లెఫ్ట్ అని ఇంగ్లీషు భాషలోను (అర్థము - విడిచి పెట్టెను) ‘ఎడమ’ అని తెలుగులోను (అర్థము - ఎడమ, దూరమగును పేరు వచ్చినది. కుడి చేయి మాత్రం పట్టువిడువ కూడదు. అది రైట్‌హాoడ్ రైట్ అనగా సరి. తప్పుకాదు.
(స.శి.సు.ప్ర.పు.228)