మేధాశక్తి, తెలివితేటలున్న వానిని వీడు బుద్ధిమంతుడప్పా అంటారు. వాడు బుద్ధిమంతుడు కాదు, తెలివిమంతుడు కావచ్చును. శ్రద్ధ సత్యము ఋతము, యోగము, మహత్తత్త్వము ఈ ఐదింటి చేరిక సమయమునందే బుద్ధి అనాలి. ఈ యోగ ముండినప్పటికీ మధ్యలో దేహముంటుందాది. అదే మహత్తత్త్వము. అనగా గొప్ప తత్త్వము. మహత్ అనగా గొప్ప అని అర్థము. తత్త్వము అనగా రెండిటినీ గుర్తించింది అని. అందుకనే మహా మంత్రమునందు "తత్ త్వం అసి" అన్నారు. అదే నేను అని ఈ సర్వశక్తితో కూడిన దివ్యత్వమే నేను అనే తత్వమే ఈ మహతత్తత్త్వము. నేనే సత్ చిత్ ఆనందమును అనేదే మహము. స్వస్వరూప సందర్శన భాగ్యమే తత్త్వము, స్వస్వరూపసంధానమే తత్త్వము. తానెవరో గుర్తించుకోవటమే సరిమైన తత్వము. తానెవరో గుర్తించుకోగలిగితే అదే నిజమైన బుద్ధి. తానెవరో తెలియకుండా తెలివి తేటలతో ప్రపంచమునంతా తెలిసికొనినవాడు బుద్ధిమంతుడు కాడు. తనను తాను తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు. బుద్ధి అనే దానిని సామాన్య స్థితిలో, సామాన్యమైన పేరుతో అనుభవించ రాదు. ఇది ఆత్మకు ప్రతిబింబమనే చెప్పవచ్చు.
ఆత్మయొక్క Resound, Reflection, Reaction తత్వమే బుద్ధి యొక్క ప్రమాణము. విద్యార్థి ఈ బుద్ధిరహస్యాన్ని తెలుసుకున్నపుడే తాము బుద్ధిమంతుడా లేక భ్రమలో కూడినవాడా అని తనకు తానే నిర్ణయము చేసుకోవచ్చు. First rank వచ్చిన లేక O grade వచ్చిన తెలివితేటలు గలవాడు అని భావించవచ్చు. అది మేధాశక్తికి సంబంధించినది. మే-మే-మే- అదే మేధా శక్తి మేధా దానిలో పుట్టిన శక్తి. ఈ మేధాశక్తియే మాయాశక్తి..
(బృత్ర.పు. 100/101)
(చూ|| బుద్ధి, బ్రహ్మత్వము, సృష్టి )