హృదయమనే క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు
దాని చుట్టు కలుపు ముండ్ల కలప పెరిగియుండు
కలుపు తీసి శుభ్రపరచ కల్పతరువు కానపడును
అదియే నీ అభీష్టముల నొసగు కామధేనువు.
కల్పవృక్షము, కామధేనువూ కూడనూ ఒక్క మానవుని యందే వుంటున్నది. ఈ మానవత్వమనేది గోచరమయ్యే వస్తువునకు, అగోచరమయ్యే వస్తువునకు మధ్య ఒక వారధివలె ఉంటున్నది. ఇట్టి మానవ త్వం మధ్యలో ఉన్నది. కాబట్టే మానవునికి మర్త్యుడు అని మరొక పేరు.
(స.ది.పు.129)