ఒక గ్రామంలో కలరాపడి చాలామంది చనిపోయినారు. ఒక సన్యాసి ఆ గ్రామమునకు వచ్చి తిరిగి పోపుచు, దారిలో కనపడిన కలరా దేవతను, ఎందరిని కాజేసితివి?" అని అడిగెను. పదిమందిని మాత్రమే అని ఆమె బదులు చెప్పెను. సన్యాసి "వందకు పైగా చనిపోయినట్లు విన్నానే! నిజం చెప్పు అనెను. అప్పుడా దేవత, నిజంగా నేను చంపింది పదిమందిని మాత్రమే. తక్కినవారు భయపడి చచ్చినవారు అని చెప్పెను. కాబట్టి మనోదౌర్బల్యమే మానవునకు మహాపకారి.
(శ్రీ న.2000పు.58)