మతకర్తలు

ఈ చిత్ర విచిత్రమైన చరాచర ప్రపంచమునకు సృష్టికర్త ఒకడున్నాడు. అతడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు.సర్వ వ్యాపకుడు. అట్టి భగవంతుని అనేకమంది అనేకమైన పేర్లతో స్మరిస్తూ, భజిస్తూ తరిస్తూ వచ్చారు. మానవునికి ఐకమత్యం, సంఘీభావం భక్తి ప్రపత్తులు అత్యవసరం. ఇట్టి పవిత్రమైన మూడు సూత్రములను మానవలోకంలో అభివృద్ధి చేయతలంచి అనేకమంది మహనీయులు కొన్ని మతములను స్థాపిస్తూ వచ్చారు. మతము అనగా కేవలం ఒక పరిమితమైనది కాదు. మానవాభ్యుదయమునకు జీవిత పరమావధికిమార్గమును చూపించేటటువంటిదే మతము. మానవుని యందలి మానవత్వమును ప్రేరేపించి, పదిమందితో కలిసి ఆనందంగా జీవితము గడిపింపచేసేది మతము. జీవునకు దేవునకు మధ్యనున్న సంబంధ బాంధవ్యాన్ని చేకూర్చుటటువంటిదే మతము. అనేకత్వమునందలి ఏకత్వమును నిరూపించేటటువంటిదే మతము. ప్రేమ, త్యాగము, సేవ, ధర్మము మున్నగునవి మతమునకు ప్రధానమైన అంగములు. మానవుని యందలి దివ్యభావములను, నవ్యభావములను వ్యాపింపచేసి సమాజమునకు అందింప చేసేది మతము. మానవ జీవితంలో ఔన్నత్యమును, ఆనందమును, సఖ్యతను నిరూపింప జేసి, జగత్తునకు ఏకత్వాన్ని బోధించునదే మతము.

 

ఈనాడు ఇటువంటి దివ్యమైన మతమును సంకుచితమైన భావములతో అనుభవిస్తూ, ఆచరిస్తూ, ప్రచార ప్రబోధలు సల్పుతూ ఉండటం చాలా దురదృష్టకరమైన విషయం. ఈ మతమే సమస్త మానవజాతికి అంతర్భాగమైన ప్రవాహము. ఇట్టి పవిత్రమైన మత రహస్యమును సమాజమునందు వ్యాపింపచేసే నిమిత్తమై మత కర్తలు కొన్ని విధాలైన నిబంధనలుగావించి జగత్తులో ప్రచార ప్రబోధములు సలుపుతూ వచ్చారు. భౌద్ధమతంఅమోహత్వాన్ని, పవిత్రతను, దివ్యత్వమును ప్రచారం చేయుటకు "సత్యం, అహింసలే" ప్రధానమైన సూత్రములని ప్రచారముచేస్తూ వచ్చింది. క్రిస్టియన్ మతం "మానవులందరు భగవంతుని బిడ్డలే" ప్రతి ఒక్కరు సోదరసోదరీ భావము పెంచుకొని, దివ్యమైన దైవత్వమునుప్రార్థించి, ఆనందమును అనుభవించాలని ప్రచారము చేస్తూ వచ్చింది. All are one be alike to everyone"అని ప్రభోధలు సల్పినవాడు జీసస్. ఇంక మహమ్మదీయ మతమునందు ఆత్మరీతిగా "అందరూ సోదరులే". ఈ సోదర భావమును అభివృద్ధి పరచుకొని జగత్తునకు శాంతి భద్రతలు చేకూర్చటానికి ప్రార్థనేప్రధానమైనటువంటి మార్గమని వారు ప్రభోధించిరి.

(స.సా.జ.91పు.19/20)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage