సర్వజ్ఞమైన, సర్వశక్తివంతమైన ఆత్మ తత్త్వమును పరమార్థ స్థితిని ప్రేమించుటే అతనిని ఆరాధించుట ఆత్మనేమానవునకు ఏకైక ప్రియుడు. ఇహ పరములందు గల సర్వము కన్ననూ ప్రియతర వస్తువుగా భావించుట అతనిని ఆరాధించుట ఇదియే వేద ప్రబోధ. వేదములు ప్రతిపాదించింది నిష్ణుర నియమముల యొక్కఘోర సందోహముకాదు. కార్యకారణ రూపమైన కారాగారముగాదు. ఈ నియమముల కన్నింటికీ ప్రభువైనభౌతిక పదార్థములలోని, భౌతిక శక్తులలోని ప్రతి అణువు నందును నిలిచి దీపించుచుండు వాడు వకడు కలడని, అతని ఆజ్ఞ వలననే పంచభూతములు తమ తమ పనులు చేయుచున్నవనియు ప్రతిపాదించును. ఇదియే వేదములందు ప్రతిపాదించిన ప్రేమ సిద్ధాంతము.
నీటియందుద్భవించియు నీటిచేత తడియక యుండు తామరాకువలె మానవుడు ఈ లోకమున జీవింపవలెను. అని పరమార్ధము: ఇహముననో పరముననో ప్రతిఫలమ పేక్షించ భగవంతుని ప్రేమించుట మంచిదేకాని, ఇంతకంటే ప్రియమైన వస్తువు మరొకటి లేకపోవుటచే దీనిని నిష్కామ ప్రేమగా ప్రేమించుట శ్రేష్టమని కూడా దీని అంతరార్థము. అనగా భగవంతుని ప్రేమించుటకేప్రేమను కలిగి యున్నానని భావించుట భారతీయ పరమార్థము.
(స.వా.పు.3/4)