భగవంతుని ఎందుకోసం ప్రార్థించాలి మనం? ఏది నీ దగ్గర లేదో దానికోసం ప్రార్థించాలి. నీ దగ్గర ప్రేమ లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. అవన్నీ భగవంతుని దగ్గరే ఉన్నాయి. కనుక వాటి నిమిత్తమై భగవంతుని ప్రార్థించు. నీ దగ్గర సంతోషం ఉందిగాని ఆనందం లేదు. సంతోషం తనకు సంబంధించినది. ఆనందం హృదయానికి సంబంధించినది. ఇట్టి ఆనందమును భగవంతుని నుండి ఆశించు.. నీవు భగవంతుని అడుగవలసినవి లౌకికమైనవికావు. "భగవంతుడా! నాకు శాంతిని ప్రసాదించు ఆనందాన్ని ప్రసాదించు, ప్రేమను ప్రసాదించు" అని ప్రార్థించు.
(దే.యు.పు.7)