భగవంతుడు ఒక పోస్టుమాన్ వంటివాడు. ఈ పోస్టుమాన్ ఒక ఇంటిలో ఒక జాబు ఇస్తాడు. మరొక ఇంట్లో వేరొక జాబు ఇస్తాడు. మొదటివాబు వచ్చిన ఇంటివారు ఘోల్లున ఏడుస్తారు. రెండో ఇంటిలో వారు ఫక్కున నవ్వుతారు. వారు నవ్వటానికి వీరు ఏడవటానికి కేవలం పోస్టుమానా కర్త? కాదు... వారికి వచ్చిన జాబులే కారణం. కనుకనే మంచి చెడ్డలనేవి భగవంతుడు అందిస్తున్నాడు. ఏడ్చేది, నవ్వేది మీ యొక్క ప్రవర్తనల ఫలితము వల్లనే. ఇతను కేవలం సాక్షీభూతుడు.
(శ్రీసా.గీ. పు. 7)