నాలుగు ప్రతిబంధములుగా వున్నది. అవియే విషయాసక్తి, ప్రజ్ఞామాంద్యము, కుతర్కము, విపర్యయ దురాగ్రహము.ఇందులో విషయసక్తి అనగా పెద్దలచెంత వాక్యార్థ శ్రవణము చేయుచుండగా వృత్తి శాబ్దాది విషయాయల మగుట, ప్రజ్ఞామాంద్య మనగా చెప్పిన విషయములు బుద్ధికి తోచకుండుట, కుతర్క మనగా పెద్దల వాక్యములకు విపరీతముగా అర్థము చేయుట. విపర్యయదురాగ్రహ మనగా సర్వులకంటే నేనే గొప్ప యని తనది తప్పయిననూ సరియని సమర్థించుకొను దుష్టబుద్ధి. భావి ప్రతిబంధకమనగా యే సమయమునకుయేమిచ్చునో యని ముందుగానే చింతించుట (అనగా రాబోవు వాటికి కృంగి, పొంగుట)
(ప్ర. శో.వాపు 22/23)