దేహపోషణ కోసం ఒక ప్రణాళిక వేసుకుంటారు - అదే విధంగా ఆధ్యాత్మిక పరిపుష్టికి ఒక ప్రణాళిక ఉండాలి.
ఉదయం జపమూ - ధ్యానమూ ఫలహారం,
మధ్యాహ్న భోజనం, నిత్యమూ భగవన్నామస్మరణం
సాయింకాలపు ఫలహారం.
రాత్రి భోజనం, భజన కీర్తనం పవిత్ర గ్రంధ పఠనం
ఈ నియమాలను అనుసరిస్తే సుఖంగా నిద్రపోయి –
నవశక్తితో మేలు కొనగలరు.
సమభావనకోసం - చిత్త శాంతికోసం హృదయాలు పరితపించి నపుడు ఆధ్యాత్మిక శక్తి సంపన్నుల సంసర్గం అనే జలంలో మీరు మునకలు వేయాలి.
మీరు చేసిన ప్రతిపని దైవ ప్రేరితమైనపుడు చేసిన పనుల ఫలితమును భగవంతునికి సమర్పణ చేసినపుడు, ఏనాటి లెక్క ఆనాటితో సరి. మరుసటి రోజుకు పేరుకోవు. అట్టి సంపూర్ణ విశ్వాసం నిలిపితే, భగవంతుడు మీకు అన్నవస్త్రాలే కాక, అమృతత్వం కూడ అనుగ్రహించ గలడని మరువకండి. ఏపనిచేస్తున్నప్పటికి – రామ, కృష్ణ - శివ,హరి వంటి దైవ నామం మీ నాలుక మీద నర్తించాలి. ఇందుకు ప్రత్యేక సమయంగాని - శక్తిగాని వెచ్చించ నవుసరం లేదు. ఉదయాన దైవనామంతో నిద్రలేవండి. రాత్రివేళ తలక్రింద చెయ్యి పెట్టుకొని, దివ్య నామస్మరణ చేస్తూ నిద్రలోకి జారిపోవాలి.
(త.శ.మ.పు.151)