ప్రజ్ఞ అనగా constant Integrated awareness మాత్రము మార్పుచెందేది కాదు. ఒక కాలములో ఉంటే మరొక కాలములో లేకుండా ఉండేది కాదు. అందువలన Constant Integrated awareness ఎప్పటికీ, ఎల్లకాలములందు ఎల్ల ప్రదేశములందు ఇది సమంగానే ఉంటున్నది. దీనిని పురస్కరించుకునే వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అనింది. ఈ ప్రజ్ఞానమే ఆత్మ. ప్రజ్ఞానము, ఎరుక, ఆనందము, నేను, బ్రహ్మ ఇవన్ని ఆత్మకు పర్యాయ పదములే. భౌతికమైన లోకము గుర్తించి దీనికి పేర్లుమారుస్తూ వచ్చారు. ఈ టంబ్లరులో నీరుంటున్నది. ఈ నీరును తెలుగు వారు నీరు" అని, తమిళులు తన్ని అని హిందీవారు పానీ" అని ఇంగ్లీషు వారు వాటర్ అని సంస్కృతము వారు ‘వారి’" అని అంటారు. ఈ విధంగా ఒక్కొక్కరు వారివారి భాషలు పురస్కరించుకొని పేర్లు పెడుతూ వచ్చారుగాని నీరును ఎవరూ మార్చలేరు కదా. శక్తి అన్నా, ఎరుకలన్నా, ఆత్మఆన్నా, బ్రహ్మం అన్నా యివన్ని వారి వారి పర్యాయ పదములుగా మార్చుకుంటూ వచ్చారు. కాని మానవుడు ఒక్కొక్క పేరును ఒక్కొక్క రూపముగాభావిస్తున్నాడు. ఇది దేహము. ఇది క్షేత్రము. క్షేత్రములో క్షేత్రజ్ఞుడు అనేవాడు ఒకడున్నాడు. ఆ క్షేత్రజ్ఞుడులేక దీనికి క్షేత్రమనే పేరే లేదు. కనుక పేరుకు తగిన ప్రవర్తన అందులో గుర్తింపచేస్తుంది.
(ద.స.స.పు 86/87)
(చూ|| ఆయస్కాంతశక్తి)