పూర్వము ఆవు పేడను నీటిలో కలిపి, ఇంటిముందర చల్లుకోవటం వాడుకలో ఉండినది. "ఈ పేడనీళ్ళము ఇంటిముందు చల్లుకునే బదులు, మార్బుల్ స్టోన్సుఅమర్చుకొని, శుభ్రముగా పెట్టుకోవచ్చు గదా అని నేటి సైంటిస్టులు భావిస్తున్నారు. కాదు, కాదు ఈ పేడలోపల క్రిములను చంపే శక్తిగల పదార్థముంటున్నది. పేడనీళ్లను ఇంటి ముందర చల్లినప్పుడు, ఇంటి ముందున్న విషపురుగు లన్నీ నాశనమౌతాయి. తద్వారా మనుష్యుల ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది. దురదృష్టవశాత్తు నేటి సైంటిస్టులు ఇటువంటి చిన్న చిన్న విషయాలను పరిశోధించకుండా, ఎక్కడో మైళ్ళ దూరంలోనున్న సూర్యచంద్రులను పరిశోధించుటకై ప్రయత్నిస్తున్నారు.
(స.సా.ఆ.91 పు. 261/262)
(చూ॥ గొబ్బిలు)