దినకరుడు శాంతుడై తోచె దినము లింత
కురుచలయ్యెను, చలిగాలి చురుకు హెచ్చె
పొలములన్ రేయి గ్రుడ్డి వెన్నెలలోన
కుప్పలన్ మార్పు కాపులు గొంతులెత్తి
పదములన్ పాడ దొడగిరి పచ్చపూలు
జనుప చేలకు ముత్యాల సరుల గూర్చె
మిరపపండ్లు కుంకుమ మెరుపు దాల్చె
బంతి పువ్వులు మొగము లల్లంత విప్పి
మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి
సరసురాలైన పుష్యమాసంబు వచ్చె.
(స. సా..వా. పు. 31)