పరమేశ్వరు పృశ్ని గర్భుడు. పృశ్ని అనగా పరిశుద్ధము, పవిత్రము, నిర్మలం అని అర్థములు. పరమేశ్వరుని బుద్ధి దోషరహితమని అర్థము.
ఋషులు మంత్రద్రష్టలై పరిశుద్ధాన్త కరుణులై బ్రహ్మప్రేరితులై తదనుగ్రహ పాత్రులై తపస్సమాధిలో మంత్ర జాతమును దర్శించిరి. అట్టి మంత్రములను దర్శించిన మంత్ర ద్రష్టలు కూడా భగవంతుని పృశ్ని గర్భుడని వర్ణించిరి. అయితే మంత్ర ద్రష్టలగు ఋషులు కర్మబద్ధులై మరల జన్మించువారు కారు. కల్పాదియందు మాత్రమే బ్రహ్మచే సృజింపబడుతారు. కాన వీరిని ఆజ: అని కూడా శృతి చెప్పింది. వారు సహజముగనే పరిశుద్ధాః కరుణులు. వారు పృశ్ని అని పిలువబడిరి. అట్టి పరిశుద్ధ స్వరూపులై తపము నాచరించిరి. ఆ తపస్సమాధిలో స్వాయంభువనమగు బ్రహ్మ వారికి అభివ్యక్త మాయెను. బ్రహ్మసాక్షాత్కారమును బడిపి. బ్రహ్మయజ్ఞమును దర్శించిరి.
( లీ .వా .పు 13 /14)
(చూ బ్రహ్మయజ్ఞము)