ఈనాడు Bookish Knowledge (పుస్తకజ్ఞానం) మాత్రం పెరిగిపోతున్నది. అనుభవ జ్ఞానం (Practical Knowledge) అసలే ఉండటం లేదు. విచక్షణా జ్ఞానం (Discrimination Knowledge) ఏమాత్రం లేకుండా పోతున్నది. ఈ నాటి Bookish Knowledge రేపు knowledge, తరువాత Elergy గా వికటిస్తున్నది. అదికాదుknowledge దివ్యమైన Energy గా మారాలిగాని, Elergy గా మాత్రం కాదు. అనుభవం లేని విద్య అక్కరకు రాదు. వక్తిని సముపార్జించి పెట్టని విద్యవలన ప్రయోజనం లేదు. భౌతిక, శారీరక, ఆర్థిక బలములతోపాటు: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తులు కూడా కలిసినపుడు అది దివ్యశక్తిగా మారుతుంది. అటువంటి దివ్యశక్తిని విద్యార్థులు సముపార్జించాలి.
(శ్రీజూన్ 97 పు.73)