"బాబా అది చేయి, ఇది చేయి, మా మనసు మార్చు" అని అడుగుతుంటారు. కానీ అది బాబా పనా! మీ కర్తవ్యమది. అన్నీ బాబా చేస్తుంటే యింక మీరు చేసే పని ఏమిటి? ఇది కేవలం పరిపూర్ణంగా సోమరితనమే. మీ ప్రయత్నంలో మీరు సాధించాలి. పురుష ప్రయత్నము చేసినప్పుడే భగవంతుని సహాయం లభిస్తుంది. భగవంతుడా! ఇది చేయి, అదిచేయి, మనసు మార్చు అనటం బలహీనత యొక్క లక్షణము. పరిపూర్ణ విశ్వాసముంటే మీ మనస్సు ఎందుకు మారదు? అది లేదు కాబట్టే నన్ను మార్చమని కోరుతున్నారు. “నాది మనస్సు మార్చే పనికాదు. మీ కర్మ తీర్చుపని నాది." ప్రతివ్యక్తి ఈ సత్యమును గుర్తించాలి. మొట్టమొదట మీలోని దోషములను నిర్మూలించుకోండి. మీ భక్తి ప్రపత్తులు స్థిరమైనవిగా చేసుకోండి. ఎట్టి పరిస్థితులందు మార్పు లేకుండా చూసుకోండి.అది మీ పురుష ప్రయత్నము. అప్పుడే భగవదనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ సత్యమార్గంలో ప్రవేశించి, ప్రేమ మార్గములో నడచి అనంతమైన దివ్యత్వంలో లీనంకండి.
(పపు 77)