పార్టుడు అంటే అర్జునుడే కాదు. పృధ్వీపుత్రుడైనవాడు పార్ధుడు. మీరందరూ పృధ్వీపుత్రులే. మీరందరు భగవంతుని సారధిగా స్వీకరించాలి. బుద్ధి భగవంతుని
యొక్క ఆత్మ ప్రతి బింబము కనుక బుద్ధిని సహజము గా పెట్టుకొని భగవంతుని సన్నిధిని చేరటానికి కృషిచేయండి. ఈ అన్నింటికిని ప్రేమ అత్యవసరము. ప్రేమలేకుండా యేకార్యము చేయటానికి వీలుకాదు. ప్రేమ వుండినపుడే తినటానికి త్రాగటానికి పూనుకుంటాము. ఆ ప్రేమస్వరూపుడే భగవంతుడు. సత్యభాస్కరుడు భగవంతుడు. సద్గుణములకు నిలయమైన వాడు. సర్వ ప్రేమచేతనీ యదార్థ స్వరూపాన్ని గుర్తించటానికి, బుద్ధిని ఆశ్రయించి తద్వారా నీ మానసిక తత్వాన్ని పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా దివ్యమైన భవ్యమైనటువంటి నవ్యమైన రూపకముగా తీర్చి దిద్దుకో..
(బృత్ర, పు.103)