కేవలం విద్య నేర్చినంత మాత్రాన మిమ్మల్ని సమాజం గౌరవించదు. విద్యతోపాటు సంస్కారం కూడా అత్యవసరం. విద్య - నెగెటివ్, సంస్కారం - పాజిటివ్. కరెంటు ప్రసరించడానికి పాజిటివ్, నెగెటివ్ రెండూ అవసరం కదా! అదేరీతిగా, విద్యకుసంస్కారం తోడైనప్పుడే మీరు ఉన్నత స్థితిని చేరుకోగలరు. విద్య కేవలం ఇన్ఫర్మేషన్ (విషయ పరిజ్ఞానము) ను అందిస్తుంది; సంస్కారం ట్రాన్స్ ఫర్మేషన్ (హృదయపరివర్తన) ను చేకూర్చుతుంది. సంస్కారంలేని విద్య నీరులేని పైరు వంటిది. కరెంటులేని వైరువంటిది. దీపములేని ఇల్లువంటిది, పంతులులేని బడివంటిది, దేవుడు లేని గుడివంటిది.
(ఆ.భా.పు.2)