పాముకు రెండు పిచ్చి గుణములు కలవు. ఒకటి వంకరిటింకరి నడక, రెండవది చూచినదానినంతా, అడ్డము వచ్చిన వాటినన్నింటిని, కరచుట. ఈ రెండునూ మానవునిలో అక్షరాలా ప్రత్యక్షముగు చున్నవి. చక్కని నడకలేదు. చూచినవన్నింటిని పట్టుకొనుటకు ప్రయత్నించును. అయితే పాములో ఒక పవిత్రమైన స్వభావమున్నది. అది యేదనిన నాగస్వరము పట్టిన యెట్టి విషసర్పమయినా అనందముగా అందులో పడగవిప్పి ఆడుతూ, తన సర్వస్వమునూ ఆ స్వరమున లీనము చేయును. అటులనే మానవుడు అభ్యాసము ద్వారా ప్రణవములో మనసున లీనము చేయవచ్చును. కనుక శబ్దోపాసన పరమాత్ముని పొందుటకు ప్రధానమార్గమై యున్నది. శబ్దమే పరమాత్మ. అందుకనే మానవునియందలి పురుషార్ధ శక్తిని నేనే అని పరమాత్ముడు తెలిపెను.
(గీ.పు. 106)