"పండగలు Holidays కావు Holydays (పండగలు శెలవుదినములు కావు, పర్వదినములు)" అయితే ఈనాడుదురదృష్టవశాత్తు ఇటువంటి పవిత్రమైన భావన చాలా మందిలో లేకుండా పోయింది. పర్వదినాలు శెలవు దినాలుగా భావించిపిక్నిక్లకు వెళ్ళటం పరిపాటైంది. పార్టీలు చేసు కుంటున్నారు. శివరాత్రి జాగరణ పేరులో చీట్ల పేకలు ఆడుతున్నారు. త్రాగుతున్నారు. తందనాలు తొక్కుతున్నారు. ఇది మారాలి. ఈ భావన మారాలి. ఈ ఆలోచనా సరళి మారాలి. పండుగ దినాలు పర్వదినాలుగా భావించి, నిర్మలచిత్తంతో కొద్దిసేపైనా భగవంతుని స్మరించాలి. పవిత్ర హృదయంలో భగవన్నామం చేయాలి. అప్పుడే పర్వదినం (Holyday) యొక్క ప్రాముఖ్యతను సద్వినియోగ పరచిన వారమవుతాము.
(ఆ.పు.3b)