క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్యక్షేత్రేషు భారత
క్షేత్ర క్షేత్రజ్ఞయోః జ్ణానం యత్తద్ జ్ఞానం మతం మమ
ప్రపంచమంతయు క్షేత్రక్షేత్రజ్ఞుల సమ్మిళత స్వరూపము. ప్రకృతి ప్రతిబింబమే మానవుని శరీరక్షేత్రము. విశ్వమునందున్న చేతనా చేతనములన్నీ మానవునిదేహమునందే యిమిడి వున్నది. ఈ ప్రపంచమంతయు మానవుని యందుండిన ప్రతిబింబములే. Reflection of the inner being. క్షేత్రజ్ఞుని తెలుసుకోవాలంటే జ్ఞానము కావాలి. ఏమిటీ జ్ఞానము? కేవలము పుస్తక జ్ఞానము కాదు. సూఫర్ పీషియల్ నాలె డ్జినా? కాదు. జనరల్ నాలెడ్జినా? అసలే కాదు. డిస్క్రిమినేషన్ నాలెడ్జా? ఇది వ్యక్తిగతమైనది. ఎక్స్పీరియన్స్ నాలెడ్జా? ప్రాక్టికల్ నాలెడ్డి కూడను వ్యక్తిగతమైనది. ఇవన్నియు భౌతికమైన లౌకికమైన జ్ఞానములు, వస్తువిచారణ చేత గుర్తింపబడే జ్ఞానము పదార్థ జ్ఞానము. విషయమును ఆధారము చేసుకొని దాని విశిష్టతను గుర్తించే జ్ఞానము విషయజ్ఞానము. ఈ విధమైన జ్ఞానముల చేత దివ్యమైన ఆత్మతత్వమును ఎవ్వరు గుర్తించలేరు. వజ్రము కోయవలెనంటె వజ్రమే కావాలి. కాలులో విరిగిన ముల్లును తీయాలంటే ముల్లే కావాలి. ఆత్మతత్వమును గుర్తించాలంటే ఆత్మజ్ఞానమే కావాలి. ఈనాడు భౌతికమైన యీ ప్రపంచమునందు దేనిని జ్ఞానమని భావిస్తున్నామో అది అంతా అజ్ఞానమే. ఆత్మజ్ఞానమే సత్యజ్ఞానము. ఆత్మ అన్నా జ్ఞానమన్నా రెండూ ఒక్కటే. నిజమైన ఎరుకయే జ్ఞానము. పదార్థములను క్రోడీకరించుకొని విషయాలను సంగ్రహించుకొని తద్ద్వారా తెలుసుకొనే జ్ఞానము అజ్ఞానముతో సమానమే. ఈ జ్ఞానమునకు జ్ఞానము జ్ణే యము జ్ఞా త అనే త్రిపుటి ఉండదు. ఇవి మానసిక వృత్తులు, మనోనాశమైన తరువాత ఏర్పడే మూలాధారమైన తత్వమే జ్ఞానము.
(బృత్ర.పు. ౧౭౧/౧౬౨)
(చూ|| క్షేత్రము, పురుషుడు)