క్షీరసాగరమును మధించినప్పుడు ప్రప్రథమములో విషము ఆవిర్భవించింది. కాని, దానితో ఆగక, నిరాశకు గురికాక, ధైర్యముతో, సాహసముతో దానిని తిరిగి మధించినప్పుడు విలువైన వస్తువులన్నీ దాని నుండి ఆవిర్భవించాయి. అదేవిధముగా ఆధ్యాత్మిక తత్వమునందు హృదయమనే క్షీర సాగరమును జ్ఞానముతో మధించినప్పుడు మనసు బాధించే కష్టనష్టములు, నిం దలు, నిష్ణూరములు ప్రప్రధమంలో ఆవిర్భవిస్తాయి. కాని ధైర్యంతో,సాహసంతో,విశ్వాసంతో గట్టిగా పట్టుబట్టి మధించినప్పుడు అందులో దయ, ప్రేమ,కరుణ,క్షమ, శాంతి ఇత్యాది విలువైనవి ఆవిర్భవిస్తాయి. కనుక, మానవుడు నిరాశకు గురికాక, ధైర్యసాహసములతో ఆత్మ, విశ్వాసముతో కార్యములలో పాల్గొనాలి.
(శ్రీ భ.ఉ.పు.170)