మదపుటేనుగును సర్కసులో తర్ఫీదు చేసి ఆడించు విధమున మనసునకు శమము, దమము, తితిక్ష, శ్రద్ధ, సమాధానములతో తర్ఫీదు చేయవలెను. మానవునకు అక్కర కలిగించు పనులలో మనసు లొంగునట్లు క్రమశిక్షణతో దానికి తర్ఫీదు నీయవలెను.
ద్వేషము అసూయ యనెడి కారు మేఘములు నిన్ను చుట్టుముట్టినప్పుడు, నీవు విశ్వసించిన వారు నీ దరిచేరక నిన్ను విడిచి పెట్టినప్పుడు, ఒక్క క్రమ శిక్షణే నీకు రక్ష. కరుణ అనే పిలువ మీద నీఅహంకారమును బలియిచ్చి, నీ శక్తి సామర్థ్యములతో ఇతరులకు సేవ చెయ్యి. నీ వెట్టి కార్యములందు నిమగ్సుడవైనప్పటికీ నామ స్మరణ, జపధ్యానముల ద్వారా ఆహంకారమును విసర్జించు". (స. 8. సు. తృపు. 158)
బిడ్డల క్రమశిక్షణ తల్లుల దగ్గర నుండే ప్రారంభమవు తుంది. అందువల్ల తల్లులు తగుజాగ్రత్తగా బిడ్డలకు మంచి అలవాట్లు చెప్పాలి. తాము ఒకటిచేస్తూ బిడ్డలకు యింకో రకంగా చేస్తే వాండ్లు చేయరు. బిడ్డలు తల్లులనుజూసే నేర్చుకుంటారు. తల్లి దండ్రులు బిడ్డల క్రమశిక్షణకు బాధ్యులు, తర్వాత గురువుల బాధ్యత. (సు.బి. పు. 7)
బిడ్డల క్రమశిక్షణ తల్లుల దగ్గరనుండే ప్రారంభమవుతుంది. అందువల్ల తల్లులు తగు జాగ్రత్తగా బిడ్డలకు మంచి అలవాట్లు నేర్పించాలి. తాము ఒకటి చేస్తూ, బిడ్డలకు ఇంకోరకంగా చెప్తే, వాళ్ళు చేయరు. బిడ్డలు తల్లులను చూసే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు బిడ్డల క్రమశిక్షణకు బాధ్యులు. తర్వాత గురువుల బాధ్యత. ”
(ఆ రోజున నేను నేర్చుకున్న పాఠం, నేను తల్లినైన తరువాత మరింత చక్కగా బోధపడింది. తల్లిదండ్రులుగా పిల్లల పెంపకం విషయంలో ప్రేమ, క్రమశిక్షణలనేవి నాణానికి బొమ్మ, బొరుసువంటివని మరచిపోకూడదు. స్వామివారు నాకు ఈ విషయం బోధిస్తూ) ……
"పిల్లలను పెంచేటప్పుడు వాళ్ళకు ఆరు సంవత్సరాలు వచ్చేవరకు వారిపై అపారంగా ప్రేమను కురిపించాలి. ఆ సమయంలో వారిని దైవాన్ని చూసినట్లుగా చూడాలి. ఆరు సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాలు వచ్చే వరకు వారిని నీ విరోధులుగా భావించాలి. ఎందుకంటే ఈ సమయంలో వాళ్ళు అన్ని విషయాలను గ్రహిస్తూ ఉంటారు. ఈ సమయంలో తగినంత క్రమశిక్షణ నేర్పకపోతే చాలా ప్రమాదం. అందువల్ల ప్రేమతో పాటు క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలి. ఈ సమయంలో వాళ్ళు అడిగినదల్లా వెంటవెంటనే ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళకి దేని విలువ కూడా తెలియకుండా పోతుంది” అన్నారు.
మరొక సందర్భంలో స్వామి ఇలా అన్నారు,"పిల్లలకు ఫలానాది పుట్టిన రోజు బహుమతిగా ఇస్తానని ఎప్పుడూ వాగ్దానం చేయకూడదు. దానికి బదులుగా సంవత్సర మంతా క్రమశిక్షణతో బాలవికాస్ తరగతులకు వెళితే, లేదా సేవాసమితిలో సేవలు చేస్తే, అడిగినది ఇవ్వటానికి ప్రయత్నిస్తాను అని చెప్పాలి. పిల్లలకు ఒక పవిత్రమైన లక్ష్యాన్ని ఏర్పరచి బహుమతులివ్వాలి తప్ప అడిగిన వెంటనే ఏదీ ఇవ్వకూడదు. అంతేకాదు, పిల్లలకు ఏదైనా ఇచ్చేటప్పుడు అసలు ఏమీ లేనివాళ్ళను చూపించి మరీ , ఇవ్వాలి. అప్పుడే వాళ్ళకి తాము ఎంత అదృష్టవంతులమో అనే భావం కలిగించాలి. దీనితోపాటు వారికి ఈ లేత వయసులోనే దయ, కరుణ, ప్రేమలాంటి భావాలను బోధించాలి. ఒక సర్జను ఆపరేషన్ థియేటర్ లో ప్రవేశించి మన శరీరాన్ని కోసినా, అది మన మంచికే కదా! అలాగే తల్లిదండ్రులు పిల్లలకు క్రమశిక్షణ నేర్పే విషయంలో తప్పనిసరిగా కఠినంగా ఉండాలి”. (స.సా. అ20 పు18/19)