ఈ కాయం శాశ్వతం కాదు. మనం చేసే సర్వ కర్మల యందు ఫలితం కూడా శాశ్వతం కాదు. అన్ని కదిలిపోయే మేఘములే ఇలాంటి కదలిపోయే మేఘముల నిమిత్తమై మనం ఎందుకు ఇంత శ్రమ పడటం? నిత్యసత్యమై నటువంటి దైవత్వానికి ప్రాకులాడటం లేదు. ఈనాడు భుక్తికోసం చదివే చదువులు చాలా శ్రద్ధగా చదువుతున్నారు కాని ముక్తికోసం చదివే చదువుల మీద శ్రద్ధ చూపటం లేదు ఈనాటి చదువులు లోక సంబధమైన మర్యాదలను, స్థానాన్ని గౌరవాన్ని అందించ వచ్చును. కాని ఈ ప్రాకృతమైన జీవితంలో కూడా మనం నిలబెట్టుకోవలసినవి రెండే రెండు. 1) సత్యం, 2) కీర్తి.
(శ్రీ . అ.96 పు. 31)
(చూ|| ఆస్థిరము)