"కాలేజీలంటే ఇటుక, సున్నముతో కట్టిన భవనములు కావు. తరగతులు నిర్వహింపబడే పెద్ద పెద్ద భవనాలను చూచి వాటిని అంచనా వేయకూడదు. ఆ తరగతులలో చదువుకునే విద్యార్థుల యొక్క శీలము, సమాజమునకు వారు ఉపయోగపడే తీరు, ఆటస్థలము లలోను, బయట వారి యొక్క ప్రవర్తన, తల్లితండ్రులు, పెద్దలు ఉపాధ్యాయుల యెడ వారికి గల గౌరవభావము, కాలేజీ చదువు పూర్తయిన తరువాత జీవితంలో వారు ఆచరించే ఆదర్శములను బట్టి కాలేజీలకు విలువ కట్టాలి."
(దై. మా. పు. 318)