ఈశ్వరుడు కాలస్వరూపుడు. అందుకే కాలాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల గర్భాయనమః, కాలాతీతాయ నమః అంటూ ఋషులు వర్ణించేరు. జననం, జీవనం, మరణం - ఇవి కాలంలోనే ఇమిడివున్నాయి. అందుచేత కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. Time wasted is life wasted. కాలము యొక్క గమనం, వేగం తెలుసుకోడానికి మీరు చేతికి వాచ్ పెట్టుకుంటారు. కాలాన్ని ఏవిధంగా పవిత్రం చేసుకోవాలో కూడా వాచీయే చెబుతుంది.
W: Watch Your Word
A. Watch Your Action
T: Watch Your Thoughts
C.Watch Your Character
H: Watch Your Heart
మీరు టైమ్ తెలుసుకోటానికి వాచ్ కేసి చూసినప్పుడల్లా ఈ పంచాక్షరీ సందేశాన్ని గుర్తుచేసుకుంటూవుండండి. పశుపక్షి మృగాలవలే ఆహార నిద్రాభయమైధునాదులకే మీ జీవితాలను అంకితం చేస్తూ కాలాన్ని దుర్వినియోగం చెయ్యకుండా దివ్యమైన మీ నిజ తత్వాన్ని గ్రహించి మీ జీవిత పరమావధి సాధించే ప్రయత్నంలో కాలాన్ని పవిత్రంగా వినియోగించండి. సత్సంభాషణతో, సత్కర్మలతో, సదాలోచనలతో, సచ్చీలములతో, విశాల హృదయంతో పరమాత్మ స్వరూపమైన కాలాన్ని పవిత్రం కావిస్తూ మీ జీవితాల్ని సార్థకం చేసుకోండి.
(శ్రీస. వా. పు.45/46)
(చూ|| నాల్గుయుగాలు)