ఒకసారి కరణం సుబ్బమ్మగారి ఇంట్లో నేనుండగా, అప్పుడు నాకు 12వ సంవత్సరం. అప్పుడు నేను నాకు ఒక పొడుగాటి గౌను కుట్టించు" అని అడిగాను. ఆమెకు కూడా ఇష్టం లేదు. స్వామీ, మీరు పంచకట్టుకోండి. గౌను ఎందుకు వేసుకుంటారు? అన్నది. లేదు, లేదు. సమయం వచ్చింది అన్నాను. స్వామి మాటకు ఎందుకు అడ్డు చెప్పాలని ఒక గౌను కుట్టించుకొని వచ్చింది. అప్పుడు రెండు అణాలకు ఒక గౌను వచ్చేది. కుట్టేవానికి ఒక బొట్టు యివ్వాలి. రెండు అణాల ఒక బొట్టుకు ఒక గౌను తయారైంది. అది నేవేసుకున్న తక్షణమే ఈశ్వరమ్మకు కబురు పెట్టింది. ఆమె నన్ను చూచి కంటినీరు పెట్టింది. ఏమి స్వామి! ఈ రూపాన్ని చూడటానికే నన్ను యిక్కడకు పిలిపించింది అని అడిగింది. చాలు. చాలు... ఈ జగత్తునకంతా ఆదర్శమైన దానిని అందిస్తున్నాను. కాషాయి వస్త్రము కట్టినప్పుడు కషాయము బుద్దులంతా పోతుంటాయి అని ఈ విధంగా బోధించాను.
(శ్రీ డి. 2001 పు. 32)