మానవులు తమ ఆత్మస్వరూపమైన తన్ను ఉపాసించుట మాని నన్ను చేరకోరుట విడచి అనిత్య శాశ్వతమైన ఫలప్రదానమును అందించు అల్పశక్తులను ఆశ్రయింతురు. దీనికి కారణము చెప్పెదను వినుము. కర్మోపాసనవలన ఫలసిద్ధి త్వరలో లభించును. ప్రత్యక్షముగా అగుపించు వాటినే ప్రజలు ఆశింతురు. అవి కేవలము శరీర యింద్రియములకు మాత్రము సంబంధించియుండును; సామాన్య మానవులు సత్యమును తెలిసికొనలేక క్షణికమయిన ప్రత్యక్షానందమునకు పాటుపడుదురే కాని శాశ్వతమయిన పరోక్షానందమునకు ప్రయత్నింపరు.
(గీ. వా. పు.68)