ఒక కర్పురపు ముక్కను ఒక డబ్బాలో పెట్టి, మూత వేసినా కూడ. కొంత కాలమునకు అది పూర్తిగా శూన్యమగును, కదా? దీనికి కారణమేమి? దాని నుoచి సతతము ధారావాహినిగా బయలుదేరు చున్న అణువులే దాని నాశనమునకు కారణమయ్యెను. పరుల దేహములనుంచి వెలువడే అణురేణువులు గాలిలో చేరి, మీరు పీల్చుకొనే గాలితో మీ దేహములందు ప్రవేశించును. మీ దేహమునుండి కూడ అదే విధముగా, లక్షలాది అణురేణువులు బయలుదేరుచున్నవి. ఈ రీతిగా విసర్జించటము స్వీకరించటము అనే రెండు క్రియలను అందరూ ఎల్లప్పుడూ చేయుచుందురు. దేహము యొక్క పటుత్వము ఆరోగ్యము క్షీణించుటకు తరుగుటకు పెరుగుటకు అన్నిటికి ఈ రెండు క్రియలే మూలకారణములు.
(స.సా.డి. 74 పు. 298/299)
(చూ॥ ఆత్మబోధ)