"తస్మై నమః కర్మణే" అని మొదట కర్మకు నమస్కరించాలి. మంచికానీ, చెడ్డకానీ, పాపముగానీ, పుణ్యముగానీ రెండూ భగవద్విభూతులే. యోగియైనవాడు మంచి చెడ్డలను లక్ష్యము చేయక యేది లభించినప్పటికిని అది భగవద్విభూతిగానే భావించి అనుభవించుటకు సిద్దముగా వుంటాడు. కర్మను ఆచరించటమే ప్రధానమైన కర్తవ్యముగా గుర్తిస్తాడు. ఈ కర్మాచరణ జన్మసార్థకత కోసము. ఇది భగవంతుని అనుగ్రహముచేతనే లభిస్తుంది.
(శ్రీ,స. గీ పు. 304)