కర్మయోగికి సంగబుద్ధికంటే. సమబుద్ధి ప్రధానమని కూడనూ అన్నాడు. సంగబుద్ధి వద్దన్నాడు; యెందుకన, బంధమునకు మూలకారణము సంఘమే, "ఈ కర్మనాది, ఈ చేసే కర్మఫలము నాది, ఈ కర్మకు కర్త నేనే" అను సంఘము బంధమునకు గురి అగును. సంగబుద్ధికి ఆతీతుడయిన, మంచిదన్నాడు కృష్ణ పరమాత్మ. సమత్వమే యోగమన్నాడు. అందుకనే కృష్ణపరమాత్మ ‘సమత్వం యోగముచ్యతే అని అన్నాడు.
(గీ.పు. 37)