ఆంధ్రప్రదేశ్ లో సుందయ్య అనే కమ్యూనిస్ట్ లీడర్ ఉండేవాడు. అతను పుట్టపర్తికి వచ్చాడు. "నేను కమ్యూనిస్ట్మండీ" అన్నాడు. నేను "come you next (కమ్ యు నెక్స ట్ ) అన్నాను. ఐదు సంవత్సరాల తరువాత ఎలక్షన్లో ఓడిపోయాడు. తరువాత అనంతపురం కాలేజీలో కలిశాడు. "పార్టీ పేరుతో వ్యక్తి స్థాయికై నేని పేరు పెట్టుకొన్నానండీ, కాని, మీరు చేసే పనులు ఏ గవర్లమెంట్ గాని ఏ వ్యక్తి గాని చేయలేరు. ఇదే పెద్ద డివినిటీ. మేం అధికారం ఉండీ డబ్బు ఉండీ, మంచి పనులేమి చేయలేకపోతున్నాం. ప్రజల డబ్బును ప్రజల కందించడానికే వెనుకంజ వేస్తున్నాం. మీరు ఒక్క వ్యక్తి ఇంత జరుపుతున్నారు. ఇదే “బిగెస్ట్ మిరకిల్ అన్నాడు. "ఆనాడు నీకు come you next అని చెప్పింది. దీనికోసమే. నీకిప్పుడు అర్ధమయిందా?" అన్నాను. నా దృష్టిలో ఆస్తికుడు నాస్తికుడు ఒక్కటే. ఆస్తికుడు విచ్చిన పువ్వువంటివాడు. నాస్తికుడు మొగ్గవంటివాడు. అయితే ఆ మొగ్గ కూడా ఒక రోజు వికస్తుంది. ఈనాటి నాస్తికుడే రేపటి ఆస్థికుడు.
(అక్షర సుమాంచాలి 70వ జన్మదినోత్సవ సమర్పణ పు. 22)