పక్షికి రెండు రెక్కలవలె బండికి రెండు చక్రాలవలె మానవునకు ఇహము, పరము ఉండాలి. పరం అంటే ఏమిటో అర్థం కాదే. అర్థం కాని దాన్ని ఎందుకు పట్టుకోవాలి. అని అనుకోవచ్చు. అర్థం కానిదే అర్థాన్ని చూపిస్తుంది. మీరీ జగత్తును చూస్తున్నారు. ఇదే స్వర్గం అంటారు. నా దృష్టిలో స్వర్గం శూన్యము. శూన్యమే స్వర్గం. దీనిని మీరు చక్కగా గుర్తించాలి. ఏది కంటికి కనిపించడం లేదో, చెవులకు వినిపించడం లేదో ఏది అర్థం కావడం లేదో, అదే కనిపింపచేస్తుంది. వినిపింపచేస్తుంది. అర్థాన్ని చూపిస్తుంది. కనిపించనిదే స్వర్గం. ఏది కనిపించడం లేదో, అదే అనుభవింప చేస్తుంది. కనిపించనిదానినే పట్టాలి. కనిపించిన దానిని పట్టిన ప్రయోజనమేమిటి.
(సా||పు 527)