క్రమక్రమేణ కోరికలను తగ్గించుకుంటూ రావాలి. దీనినే వేదాంతమందు వైరాగ్య మన్నారు. వైరాగ్యమంటే ఆలుబిడ్డలను వదలిపెట్టి అడవికి పోవటం కాదు. "భావమందు దుష్టభావంబు వీడుటే త్యాగమగును, ఆదయే యోగమగుమ" కోరికలను ఎంత తగ్గించుకొంటావో నీవు అంత ఆనందమును అనుభవిస్తావు. ఒక చిన్న ఉదాహరణ: నీవు దినానికి 20 సిగరెట్లు త్రాగుతున్నావనుకో, ఆరు పర్యాయములు టీ తీసుకుంటున్నావనుకో, సిగరెట్లు అధికంగా తీసుకోవడం చేత, టీ ఆధికంగా త్రాగడంచేత నీలో అశాంతి అభివృద్ధి అవుతున్నది. కనుక, ఒక్కొక్క దినము రెండు సిగరెట్లు, ఒక కప్పుటి చొప్పున తగ్గించుకుంటూరా, ఈ విధంగా కోరికలను తగ్గించుకున్న కొద్దీ నీ మనస్సు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. టీ కావాలంటే ఒకతూరి త్రాగు. అంతేగాని, ఇష్టం వచ్చినట్లు త్రాగితే నరాలు బలహీనమైపోతాయి. విచారణా శక్తి, జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతాయి. నీవు ఆశలను అమితంగా పెంచుకోవడం చేతనే ఆనందమును కోల్పోతున్నావు. ఆశలను ఎంత తగ్గించుకుంటే ఆనందము అంత పెరిగిపోతుంది. దైవం పట్ల రక్తిని ప్రపంచంపట్ల విరక్తిని పెంచుకోవాలి. కానీ ఈనాడు దైవప్రీతి తగ్గిపోతున్నది. మానవుడు పాపభీతి లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఎట్టి ఘోరకృత్యాని కైనా సిద్ధమవుతున్నాడు. ఇది మానవత్వం కాదు. పరులను హింసించకుండా, తాను హింసకు గురి కాకుండా జీవితాన్ని గడపాలి.
అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్యయం
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్.
అష్టాదశ పురాణముల యొక్క సారమును వ్యాసుడు ఈ రెండు వచనములలో చెప్పాడు -పరోపకారమే పుణ్యము. పర పీడనమే పాపము. కను క - (అందరికీ సహాయం చేయాలి. ఎవ్వరిని బాధ పెట్టకూడదు.)
(స.సా. ఆ.99 పు. 274/275)
(చూ|| కాలము, దూరంగా ఉంచు, మనసు)
ఆశానిరాశ
ఆశానిరాశ రెండూ మానవునకు ఉపకారమే చేస్తాయిగానీ, అపకారము చేయవు. ఈ రెండింటి యందు మనము స్థిరంగా ఉంటుండాలి. ఆశావాది భూమి పైనగాక, ఆకాశంలో కూడా సంచరించాలనే ప్రయత్నముతో విమానాన్ని కని పెట్టాడు. కానీ, నిరాశావాది భయము చేత “పారాచూట్” కని పెట్టాడు. అయితే, ఆశావాది కని పెట్టినది, నిరాశావాది కని పెట్టినది రెండూ ఉపకారమే చేస్తాయి. మరొక ఉదాహరణ: ఆశావాది ఈ గ్లాసులోపల సగభాగము నీరు ఉన్నది కదా! అని తృప్తి పడతాడు. కానీ, | నిరాశావాది ఈ గ్లాసులో సగము ఖాళీగా ఉన్నదే! అని అసంతృప్తి చెందుతాడు. అయితే, ఈ రెండూ సత్యమే. దానిని గుర్తించడానికి ప్రయత్నించాలి. కానీ, నీవు కేవలం -ఒకేదృక్కోణంలో విషయాలను చూస్తున్నావు. అందుచేతనే ఆశానిరాశలకు గురియౌతున్నావు. ఆశావాది కేవలం - గులాబీ పుష్పాన్ని మాత్రమే చూస్తాడు. నిరాశావాది దాని
క్రింద ఉండే ముల్లునే చూస్తాడు. అయితే, ముల్లు లేకుండా - గులాబీ పుష్పము ఉండదు. రెండూ కలసే ఉంటాయి, కానీ, -ముల్లు గుచ్చుకోకుండా గులాబీని మత్రమే కోసుకోవడం
నీ బుద్ధి కుశలతపై ఆధారపడి ఉన్నది. ఆశావాది ఆకాశమును చూస్తూ చంద్రుని కాంతిలో ఆనందాన్ని అనుభవిస్తాడు. కానీ, నిరాశావాది భూమిని మాత్రమే చూస్తూ అది చీకటిగా ఉంటున్నదని అశాంతికి గురియౌతుంటాడు. కనుక, నీవు క్రిందకు చూడవద్దు. Look up. Low Aim is a crime. ఉన్నతభావాలను అభివృద్ధిపరచుకో.(శ్రీవా మా – 2020 పు 8)
(చూ||నిరాశ)