భగవంతుని చరిత్రను వర్ణించాలంటే సాధ్యం కాదు. పానకంలోని పంచ దారవలె ప్రతి మానవుని యందు దైవత్వ మున్నది. వేదము "రపోవైసః" అన్నది. భగవంతుడు రసస్వరూపుడై ప్రతి మానవుని యందున్నాడు. ఆ రసమే లేకపోతే మానవుడు నీరసించి పోతాడు. దివ్యత్వం తనయందే ఉందన్న విశ్వాసాన్ని మానవుడు పెంచుకోవాలి. విశ్వాసం గలవానికి ఇంకొకరి సహాయం చేస్తుంటాడు. విశ్వాసం లేనివానికి ఎంతమంది సహాయం చేసినా ప్రయోజనముండదు. Dead body కి Decoration (నిర్జీవమైన దేహానికి అలంకరణ) ఉన్నప్పుడే ఏదైనా చేయవచ్చు. అలాంటి విశ్వాసం వల్లనే సావిత్రి గతించిన తన పతిని బ్రతికించుకోగల్గింది. చంద్రమతి భయంకరమైన దావాగ్నిని చల్లార్చ గల్గింది. సీత అగ్నిగుండంలో దూకి తన పవిత్రతను నిరూపించుకుంది. దమయంతి కామాంధుడైన కిరాతకుణ్ణి భస్మంగావించింది. ఇలాంటి మహాపతివ్రతలకు జన్మభూమి మన భరతభూమి.
(స.సా.జూ..2002 పు. 185/186)