"వేదము ధర్మమూలము.దానిని నశింపజేయకూడదు. గట్టి పునాదులపై సుప్రతిష్ఠితము గావింపబడవలెను. అట్టి ధర్మస్థాపనకే నా యవతారము. వేదపండితుల సంఖ్య యభివృద్ధి నొందవలెను. ఎచ్చటెచ్చట వేదోద్ధరణము జరుగుచుండునో, యెచ్చటెచ్చట వేదవిదులును, వేదపండితులుమ పూజింపబడుచుందురో అచ్చటచ్చట సుఖశాంతులు ప్రవర్ధమానము లగుచుండునని నమ్ముడు. విశ్వమునందు నాకెంత ప్రేమయో వేదమునందును నాకంతియే ప్రేమ. రెండును నాస్వరూపములే కదా? నా కార్యము కేవల భక్త రక్షణమే గాక విద్వత్ పోషణమును, వేద రక్షణమును కూడయని నమ్ముడు."
(స.శి.సు.ది.పు.39)