ఒక్క తూరి మనము ఇది చెడ్డ అని తెలుసుకొన్న తరువాత, ఇది పాపము అని విశ్వసించిన తర్వాత, రెండవ పర్యాయము అట్టి చెడ్డకాని, పాపముకాని ఏమాత్రము కూడను ఆచరించటానికి ప్రయత్న పూర్వకముగా ముందుకు పోకూడదు. ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞయందు మన జీవితమును సాధించినప్పుడే, మనజీవితము పవిత్రమైన జీవితముగా, ఆదర్శవంతమైన జీవితము గాకూడను రూపొందుతుంది.
(ఆ.రా.పు.236)
(చూ॥ ద్వేషం)