బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో కృషి సలిపిన వ్యక్తి. పూణేలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ వుండేవాడు. అయ్యా! స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మీరు ప్రధాని పదవి చేపడతారా అని అడిగితే - నే నొక్కడినే ప్రధానినైపోతే ప్రయోజనమేమిటి? అనేక మంది ప్రధానులను చేయగలిగే ఉపాధ్యాయుడుగానే ఉంటానన్నాడు. భారత దేశాన్ని రక్షించే యువకులను తర్ఫీదుచేసే ఉపాధ్యాయుడుగానే ఉండి పోతానన్నాడు. భారతదేశాన్ని రక్షించే యువకులను తర్ఫీదుచేసే స్థానమే నాకు గొప్ప పదవి అన్నాడు. ఉపాధ్యాయుడంటే చిన్నపాటి ఉద్యోగమని, ఏ పని లేక ఈ పనిలో చేరినామని భావించరాదు. ఆచార్య స్థానము అందరికీ లభించేది కాదు. ఇది పూర్వజన్మ సుకృతమనే చెప్పవచ్చు. భారతదేశంలో ఇప్పటికి ఇలాంటి మానీయులు, త్యాగశీలురు, ఔదార్యవంతులు ఉన్నారన్న సత్యాన్ని మీరు నిరూపించాలి. మీకు ఒకరో ఇద్దరో కామపుత్రులు ఉండవచ్చును. కాని ప్రేమపుత్రులు ఆనేకమంది. ఈ ప్రేమ పుత్రులపైన లక్ష్యముంచి భారతదేశ సౌభాగ్యాన్ని, ఔన్నత్యాన్ని, కీర్తిని మీ ద్వారా నిలబెట్టడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను. మానవతా విలువలను అతి త్వరితంగా దేశమంతటా వ్యాపింపజేస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను.
(జ.పు. 153)