ఆత్మవిశ్వాసంచేతనే లింకన్ జీవితంలో ఉన్నత స్థితికి వచ్చాడు. ఆత్మవిశ్వాసమే మానవునియొక్క ప్రాణము. అంతకుపూర్వం అమెరికా ప్రజల్లో దైవవిశ్వాసం అంతగా కనిపించేదికాదు. కానీ లింకన్ని చూసిన తరువాత అందరిలోను ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం అభివృద్ధి చెందాయి. అలాంటి ఆదర్శ పుత్రుడు ఒక్కడున్నా చాలు.
ప్రదోషే దీపకశ్చంద్రః ప్రభాతే దీపకోరవి:
త్రైలోక్యే దీపకో ధర్మ: సుపుత్రా కులదీపకః
పగటి పూట ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు. రాత్రి వేళ ప్రకాశాన్ని చేకూర్చేవాడు చంద్రుడు. ముల్లోకములూ ప్రకాశాన్ని అందిస్తుంది. ధర్మము. కులగౌరవాన్ని నిలబెట్టేవాడు సుపుత్రుడు.
(స.సా.జా, 2002 పు. 175)