ధ్యాన, జప, సాధనలందు మనసు కుదరక, తలంచిన వాంఛ నెరవేరకున్న విసుగును భగవంతుని పై చూపకుము.అది మరింత విసుగుపుట్టించి, కొద్దో గొప్పో పొందిన శాంతిని కూడా జారవిడచుకొందువు. ధ్యాన జప సమయమున అట్టి విసుగు, విరక్తి, నీరుత్సాహమే పడకూడదు. నీ సాధన లోపమని భావించి, సరిగా సాధించుటకు ప్రయత్నించు.
లోకమున సర్వసాధారణ విషయములందు ఇట్టి సహజ ప్రవర్తనలూ పరిశీలనలూ జరిపిననే పరమాత్మతత్వము అవలీలగా సాధించవచ్చును. కాన, ఈ సుబోధలను జాగ్రత్తపరచుకో. ఇవి నీస్వామి పుట్టిన పండుగకు పంచిన పలుకు మిఠాయి అని ఆరగించు, ఆనందించు. బోధపడినదా?
(స.వి. పు. 19)