“నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమల మచలం సర్వధీ సాక్షి భూతం భావాతీతం త్రిగుణ రహితం సద్గురుం తం నమామి" ఇవి ఆత్మస్వరూప స్వభావముల సరియైన గుర్తులు. ఇట్టి ఆనందము ఏనాడు దుఃఖమునుకాని కష్టములు కాని బాధలు కాని విచారములుకాని అందించదు. అట్టి పెన్నిధి మీ సన్నిధినే యుండగా దుఃఖములు విచారములు కష్టములు కలిగించే ఈ జగత్తునకై మీ రెందుకు ఆరాటపడుతున్నారు?
(బృ.త్ర.పు. ౧౬౩/౧౬౪)
(చూ: అజ్ఞానము యొక్క తత్త్యం.)