మనము ఏ పనిచేసినా, బయటవారి తృప్తి కోసము కాక, ఇతరుల ఆనందము కోసము కాక నీఆత్మ తృప్తి నిమిత్తమై చేయాలి. అదియే దైవతృప్తి.దానినేConscienceఅన్నారు. కాని, ఇలాంటి తృప్తి మనము పొందాలంటే, తనపై తన కొక విశ్వాసము కల్గాలి. ఎప్పుడు ఈ Satisfaction వస్తుందో అప్పుడే Sacrifice చేస్తాడు. ఎప్పుడు త్యాగము చేయునో అప్పుడే దైవత్వాన్ని పొందుతాడు. కనుక Self-confidence ఆత్మ విశ్వాసమే ఒక పునాది. Self-satisfaction యే ఒక Wall, Self-Sacrifice - ఒక రూఫ్. సెల్స్ - రియలైజేషన్ - లైఫ్. మొట్టమొదట Self - Realisation కు Self-Confidence కావాలి. మన విశ్వాసము క్షణక్షణమునకు కదులుతూ, మొదలుతూ ఉండకూడదు. ఎట్టి కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు సంభవించినా, ఎన్ని నిందలు, నిష్ఠూరాలకు గురియైనా మన విశ్వాసము ఒక్కటిగా, స్థిరంగా పెట్టుకోవాలి.
(స.సా.జూ. 1989 పు 146)
(చూ: ధనవంతులు, పరమభక్తి)