ఒక్క ప్రేమ పాశము తప్ప అందరిని ఐక్యము చేయుటానికి వేరే మార్గము లేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణము. ఒక కేండిల్ లైట్ పెట్టావు. దాని పైన ఆనేక రంధ్రములున్న పాత్రను మూసినావు. అందువలన ఉన్నది ఒకే లైటు. అయినప్పటికి ఆ రంధ్రముల ద్వారా అనేక లైట్లుండినట్లు కనిపిస్తున్నది. దాని పైన దట్టమైన వస్త్రమును కప్పినాము. అందులో నుండి ఏమాత్రము లైటు కనుపించటం లేదు. ఈ దట్టమైన టర్కీ టవలు తీసి పక్కన పెట్టామంటే అప్పుడు అనేక జ్యోతులుగా కనుపిస్తుంది. అనేకముగా కనుపించే ఆ పాత్రను మనము పగలగొట్టామంటే ఒక జ్యోతిగానే కనుపిస్తుంది. అదే ఏకజ్యోతి, అదే ఆత్మజ్యోతి. ఉన్నది ఒక్కటే. దానిపైన నవరంధ్రములతో కూడిన దేహమనే పాత్రను కప్పినాము కనుక అనేక విధములుగా కనుపిస్తున్నది. దేహము యొక్క రంధ్రముల ద్వారా యివి అనేక జ్యోగులుగా కనుపిస్తున్నాయి. దీని పైన మమత్వమనే దట్టమైన వస్త్రము కప్పి పెట్టాము. నాది అనే మమత్వము. నేను అనే అహంకారము ఈ రెండింటిలో నేసిన వస్త్రము యిది. ఆ రెండింటిని తీసి పారవేస్తే దేహభ్రాంతిని అదుపులో పెట్టుకుంటే అదే "ఏకోఽ హం బహుస్యామ్"
(బృత్రపు . ౮౯)
జ్యోతిని మనం వెలిగించాలంటే? ఒక ప్రమిద కావాలి. దాని లోపల తైలం పోయాలి. దానిలో ఒక వత్తిని పెట్టాలి. దీపం వెలిగించేందుకు ఒక నిప్పు పెట్టి కూడా ఉండాలి. కనుక, ప్రమిద, మానె, వత్తి, నిప్పు పెట్టె ఈ నాలుగూ ఉండినప్పుడే మనం జ్యోతిని వెలిగించగలం. ఈ జ్యోతి బాహ్యమైన చీకటిని దూరం గావిస్తుంది. వత్తి వెలిగే కొలదీ తైలం తరిగిపోతుంది. ఈ తైలం అయి పోయేటప్పటికి, వత్తి కూడా నిలచిపోతుంది. దీనినే రామదాసు చెప్పాడు.
"సారమైనది చమురురా! సత్యమైనది వత్తిరా!
ఈ వెలుగు పోయేటప్పుడు వెంట ఎవరూ రారురా!"
ఈ వెలుగు పోయేటప్పుడు దాని వెంట వత్తిగాని, తైలముగాని వెళ్లవు. అట్లే మన అంతరంగమునందు గల చీకటిని దూరం గావించుకోవాలంటే, దానికి ఒక ప్రమీద, వత్తి నూనె, అగ్గిపెట్టె కావాలి. మన హృదయమే ఒక ప్రమిద, మన మనస్పే ఒక వత్తి. ప్రేమయే లైలం, వైరాగ్యమే నిప్పుపెట్టె. ఈ నాలుగూ చేరినప్పుడే “ఆత్మజ్యోతి" ప్రకాశిస్తుంది. అప్పుడే "అజ్ఞానమనే " ఆంధకారం దూరమవుతుంది.
(శ్రీ భ. ఉ..పు.130)
దీనినే వేదము "వేదాహమేదం పురుషం మహాంతం, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్” తమస్సుకు ఆవలనున్న పరంజ్యోతిని నేను చూడగలిగాను అని వర్ణించినది. తమస్సంటే సుషుప్తి స్థితి అనగా స్వప్నము లేని స్థితి. ఈ పరంజ్యోతి తమమునకు అంధకారమునకు ఆవల వుంటుండాది. అన్నింటిని జాగ్రత్ స్వప్న సుషుప్తులందు కూడను, సర్వస్వమును ప్రకాశింపచేసేదే ఆత్మశక్తి. ఒక చిన్న ఉదాహరణ. జాగ్రత్త యందే మనము యోచించుకోవచ్చు. మీరందరు కన్నులు మూసుకోండి. ఒక్క తూరి మీరందరు జాగ్రత్తగా కన్నులు గట్టిగా మూసుకున్న తరువాత, నీవు యేమి చేస్తున్నావని నేను ప్రశ్నిస్తాను. ఏమీ లేదు చీకటిగా వుంది అంటారు. ఈ చీకటిని చూసినవా డెవరు? ఈ చీకటిని నీవు చూసి వుంటేకదా చీకటిగా వుందంటున్నావు. కనుక చీకటిని చేసే జ్యోతి నీలో ఒకటి వుంది. ఆ జ్యోతియే ఆత్మజ్యోతి. అట్టి ఆత్మజ్యోతుల ద్వారానే సమస్త విషయజ్యోతులు, సమస్త వ్యక్తి జ్యోతులు అనేకమైన యింద్రియ జ్యోతులు ప్రకాశిస్తున్నాయి.
దీపావళి పండుగ చూస్తుంటాము. ఒక కాండిల్ ముట్టించుకొని అనేక కాండిల్స్ జ్యోతులనంతా అంటిస్తూ వుంటారు. ఈ ఆధారజ్యోతి ఒకటి వుండటం వలననే కదా ఆధేయమైన అనేకజ్యోతులను వెలిగించగలుగు తున్నాము? ఆధారజ్యోతియే యీ ఆత్మజ్యోతి. అంటింప బడినటువంటివే ఈ జీవనజ్యోతులు. సమస్త జీవన జ్యోతులు ఆత్మజ్యోతుల ద్వారానే వెలుగుతున్నాయి. కన్నులు చూడగలుగుతున్నాయి.
(శ్రీ గీ.పు. 166/167)