బ్రహ్మజిజ్ఞాసకు పూర్వాంగములలో మొదటిది వివేకము" అనగా నిత్య అనిత్య వస్తువిచారణ. అంటే ఆత్మ మాత్రమే నిత్యమనియూ, దృశ్య కల్పితమైన వన్నియూ అనిత్యమనియు అన్నియూ, మార్పు చెందునవే కాని ఏదియూ శాశ్వతమైనది లేదనియూ, వీటిన్నింటికిఆధారమైన ఆత్మ నిత్యసత్యమనియూ, దీర్ఘ విచారణ వలన నిర్ణయము గావించుకొని సత్యాసత్యములను విడదీయునదే వివేకము.
(సూ.వా.పు.5)
(చూ ఆథాతో బ్రహ్మ జిజ్ఞాస, సంస్కృతి)