నిజముగా మనకు విరోధులు అని భావించేవారి యందుకూడను మంచి విషయాలు, మంచి భావాలు ఉంటే, వారు మంచి పనులేవైన చేసి ఉంటే వానిని మనము గుర్తించుట అత్యవసరము. మంచి చెడ్డలకు మూలము మన దృష్టిలోపమే తప్ప, వ్యక్తి దోషము కానేరదు. ఈ దృష్టి ఎక్కడ నుండి వచ్చినది? కేవలము మన హృదయము నుంచి సంభవించింది. అతడు నా ‘విరోధి అనేటటువంటి భావము హృదయమునందు ఏర్పడటంచేత మనదృష్టికూడను అతనియందు విరోధంగానే ఏర్పడుతుంది.
(ఆ.రా.పు.111)