"ఋగ్వేదంలో చెప్పబడ్డ విరాట్ పురుషుని సహస్ర శీర్షములు, సహస్ర బాహువులు అంటూ వర్ణించబడి ఉన్న విషయాన్ని స్వయంగా మీరు అర్థం చేసుకోగలగటం కోసమే నాలో మిమ్మల్ని యిలా వివిధ ప్రదేశాలకు తీసుకు వెళ్తున్నాను. (కస్తూరిని కూడా తీసుకు వెళ్ళారు) ఇదే విరాట్పురుషుని విశ్వరూపం చూడండి! వృత్తాకారపు పరిధిలోని ప్రజలు కేంద్ర బిందువు వైపు అంటే మూలం వైపు ఎలా పరుగు లిడివస్తున్నారో" అన్నారు బాబా.
(శ్రీ.స. ప్రే.స్ర..పు. 269)